ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు రూ.20 కోట్ల రుణం

4 Sep, 2020 17:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు రూ.20 కోట్ల రూపాయల మేర రుణాన్ని ఏపీఎండీసీ నుంచి తీసుకునేందుకు అనుమతి లభించింది. రెండూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలే అయినందున బ్యాంకు గ్యారెంటీ లేకుండా రుణాన్ని తీసుకునేందుకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అనుమతి పొందింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌గా కడప ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. (చదవండి: ‘కడప స్టీల్‌ ప్లాంట్‌’కు భారీ స్పందన)

ఏడాదికి 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో వైఎస్సార్‌ కడప జిల్లా సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,591.65 ఎకరాల్లో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది డిసెంబర్‌ 23న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సివిల్‌ పనులు శరవేగంగా జరుగుతుండగా, వచ్చే జనవరి నుంచి ప్రధాన ప్లాంటు పనులు ప్రారంభమయ్యే విధంగాఏపీహెచ్‌ఎస్‌ఎల్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. (చదవండి: కడప ఉక్కుపై దిగ్గజ కంపెనీల ఆసక్తి)

మరిన్ని వార్తలు