వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.50 కోట్లు 

22 May, 2021 05:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాల కొనుగోలుకు సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌ కంపెనీలకు రూ.50 కోట్లకుపైగా చెల్లించాలని ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎస్‌ఐడీసీ)ను ఆదేశించినట్లు తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ కోవిïÙల్డ్‌ ఒక డోస్‌ రూ.300, టాక్స్‌ 5 శాతంతో కలిపి రూ.315, కోవాగ్జిన్‌ ఒక డోస్‌ రూ.400, టాక్స్‌ 5 శాతంతో కలిపి రూ.415 వంతున చెల్లించనున్నట్లు వివరించారు.   

మరిన్ని వార్తలు