కౌలు రైతుల ఖాతాల్లో రూ.53.78 కోట్లు జమ

13 Jul, 2021 03:51 IST|Sakshi

71,714 మందికి రైతుభరోసా కింద నగదు సాయం

ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.7,500 జమ

సాక్షి, అమరావతి: అర్హత పొందిన కౌలుదారులు, దేవదాయ భూములు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం సోమవారం వైఎస్సార్‌ రైతుభరోసా కింద తొలి విడత పెట్టుబడి సాయం రూ.53.78 కోట్లు అందజేసింది. రాష్ట్రంలో గత నెల 12 నుంచి 30 వరకు రైతుభరోసా కేంద్రాల స్థాయిలో నిర్వహించిన సీసీఆర్‌సీ (సాగు హక్కు పత్రాలు) మేళాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులు 96,335 మంది సీసీఆర్‌సీలు పొందగా, వారిలో 70,098 మంది రైతు భరోసాకు అర్హత పొందారు.

వీరితోపాటు దేవదాయ భూములు సాగు చేస్తున్న 1,616 మంది కూడా అర్హత సాధించారు. ఇలా మొత్తం 71,714 మందికి రూ.7,500 చొప్పున వారి ఖాతాల్లో రూ.53.78 కోట్లు ప్రభుత్వం జమ చేసినట్టు వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు