గుంటూరు జిల్లా నూతక్కికి మోహన్‌ భగత్‌

10 Oct, 2020 07:40 IST|Sakshi
ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తున్న భగవత్‌  

నేటినుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ పదాధికారుల సమావేశం

సాక్షి, గుంటూరు: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని విజ్ఞాన విహార్‌ పాఠశాలలో శనివారం నుంచి మూడు రోజులు జరగనున్న ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆయన మూడురోజులూ ఈ సమావేశాల్లో పాల్గొంటారు. మంగళగిరి రూరల్‌ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు హైదరాబాద్‌ నుంచి విమానంలో వచ్చిన మోహన్‌ భగవత్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు భరత్, వాసు, పలువురు కార్యకర్తలు స్వాగతం పలికారు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా