నాలుగు సెక్షన్లతో పాలన

25 Apr, 2022 10:08 IST|Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉన్నతాధికారులను ప్రజలకు దగ్గర చేసే పనిని ప్రభుత్వం మొదలుపెట్టింది. నూతనంగా ఏర్పడిన జిల్లాలో జనాభా, విస్తీర్ణం తగ్గడంతో కలెక్టరేట్‌లో పాలన కోసం ఏర్పాటు చేసే సెక్షన్లను కుదించారు. ఇప్పటివరకు 8 సెక్షన్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 4కు తగ్గింది. ఈ మేరకు జీఓ కూడా విడుదలైంది. 

కలెక్టరేటే కీలకం.. 
ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం, పనులు త్వరగా జరిగేలా చూడడంలో కలెక్టరేట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. కలెక్టర్‌ కార్యాలయంలో ఇదివరకు ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్‌ అనే 8 సెక్షన్లు ఉండేవి. వీటికి తోడుగా మీ సేవ, లీగల్‌ సెక్షన్లు కూడా సేవలు అందించేవి. పథకాలు, సేవలపై ప్రజలు కలెక్టర్‌కి విన్నవించినా, వాటిని కలెక్టర్‌ ఈ సెక్షన్లలోని అధికారుల ద్వారా పరిష్కరించేవారు.  

సెక్షన్‌ –1: ఇప్పటి వరకు ఉన్న ఎ, బి సెక్షన్లను కలిపి సెక్షన్‌–1గా మార్చారు. ఎ–సెక్షన్‌లో ఉన్న ఎస్టాబ్లిష్‌మెంటు (పరిపాలన), ఆఫీస్‌ ప్రొసీడ్స్, ఎస్టాబ్లిష్‌మెంటు అండ్‌ సర్వీస్‌ మేటర్లు, డిసిప్లనరీ మేటర్లు అన్నీ క్యాడర్లకు సంబంధించినవి ఉంటాయి. బి–సెక్షన్‌లో అకౌంట్సు, ఆడిటింగ్, జీ తాలు, కోనుగోళ్లు, రికార్డుల నిర్వహణ ఉంటాయి. ఈ రెండు సెక్షన్లు ఒకటి చేశారు.  

సెక్షన్‌–2 : ఈ, జి, ఎఫ్‌ లను కలిసి ఒక సెక్షన్‌ చేశా రు. ఈ సెక్షన్‌లో ల్యాండ్‌ మేటర్లు, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్‌ ఎలిసేషన్, అసైన్‌మెంటు, హౌస్‌ సైట్స్, ప్రోహిబిటెడ్‌ ప్రోపర్టీ నిర్వహణ 22ఎ, ఫిషరీస్‌ అండ్‌ అదర్‌ ల్యాండ్‌ రికారŠుడ్స ఉంటాయి. జి సెక్షన్‌లో సెటిల్‌మెంట్లు, ఎస్టేట్‌ ఎ బోల్స్‌ యాక్టు, ఇనాం భూములు, కోర్టు సంబంధిత, ఫారెస్టు ల్యాండ్‌ వంటి అంశాలు ఉంటాయి.  ఎఫ్‌లో భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ తదితర అంశాలు ఉంటాయి. ఈ మూడింటిని ఒక్కటి చేశారు. 
సెక్షన్‌–3 : సి, హెచ్‌ సెక్షన్లు కలిపారు. మెజిస్టీరియల్‌ సెక్షన్, కుల వెరిఫికేషన్, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, ఎలక్షన్‌ అంశాలు, లా అండ్‌ ఆర్డర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఇతర అనుబంధ అంశాలు ఉంటాయి. హెచ్‌ సెక్షన్‌లో ప్రోటోకాల్, గ్రీవెన్సు, ఇతర రిలేటెడ్‌ అంశాలు ఉంటాయి.  
సెక్షన్‌–4 : ఇందులో డి సెక్షన్‌ ఉంటుంది. ఇందులో డిజాస్టర్‌ మేనేజ్‌మెంటు, విపత్తులు ఇతర అంశాలు ఉంటాయి.  

పై సెక్షన్లకు సూపరింటెండెంట్లను కూడా నియమించారు. ఇవి కాకుండా ఎప్పటిలాగానే లీగల్‌ సెక్షన్, మీ సేవ సెక్షన్లు నడుస్తున్నాయి. వీటికి సీనియర్‌ సూ పరింటెండెంట్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్ప టి వరకు ఉన్న సిబ్బందిని కుదించారు. కలెక్టరేట్‌ నుంచి సిబ్బంది విజయనగరం, మన్యం జిల్లాలకు వెళ్లారు.  

సమస్యలు లేవు.. 
జిల్లాల విభజన తర్వాత సెక్షన్లను కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ మేరకు సెక్షన్లను కుదించాం. సమస్యలేవీ లేవు. తగినంత మంది సిబ్బందిని సమకూరుస్తున్నాం.          
– ఎం.రాజ్యలక్ష్మి, డీఆర్‌ఓ    

మరిన్ని వార్తలు