ఏప్రిల్ లోపే విశాఖ నుంచి పాలన.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..

31 Jan, 2023 16:10 IST|Sakshi

తిరుమల: ఏప్రిల్‌లోపే విశాఖపట్నం నుంచి పాలన ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటామని చెప్పారు. భీమిలి రోడ్డులోనే చాలా ప్రభుత్వ ప్రాపర్టీలు, ఐటీ భవనాలు ఖాళీగా ఉన్నాయన్నారు.

ఏపీ ప్రభుత్వ గెస్ట్ హౌస్ నుంచైనా సీఎం జగన పాలన సాగించవచ్చని సుబ్బారెడ్డి చెప్పారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఎప్పటినుంచో చెబుతున్నామని, వీలైనంత త్వరగా న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తామని పేర్కొన్నారు.
చదవండి: విశాఖే మా రాజధాని.. నేనూ అక్కడికి షిఫ్ట్‌ అవుతాను: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు