171 ఆస్పత్రుల్లో సదరం క్యాంపులు

16 Jul, 2021 03:26 IST|Sakshi

ఈనెల 19వ తేదీ నుంచి ధ్రువీకరణ పరీక్షలు

కోవిడ్‌తో ఆగిపోయిన నిర్వహణ

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిన సదరం క్యాంపుల నిర్వహణను పునరుద్ధరించారు. ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 171 ఆస్పత్రుల్లో దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడానికి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి.

ఈనెల 16 నుంచి మీసేవ కేంద్రాల్లో ముందస్తు స్లాట్‌లు బుక్‌ చేసుకోవచ్చని వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ తెలిపారు. సదరం క్యాంపుల్లో భాగంగా వివిధ జబ్బులతో కదలలేని వారికి, మూగ, చెవుడు, కంటిచూపు లేకపోవడం, ఆర్థోపెడిక్‌ (ప్రమాదాల్లో గాయపడి లేదా పుట్టుకతో వికలాంగులుగా మారినవారు) సమస్యలు గుర్తించి వారికి ధ్రువీకరణ పత్రం ఇస్తారు.  

మరిన్ని వార్తలు