సదరం స్లాట్‌ల విడుదల

3 Jan, 2024 05:02 IST|Sakshi

జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు స్లాట్‌లు  

రేపటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో బుకింగ్‌కు అవకాశం  

సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టీఫికెట్లు పొందేందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు స్లాట్‌లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్‌లు బుక్‌ చేసుకున్నవారికి ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్‌టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులకు సదరం ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సదరం సర్టీఫికెట్‌ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత ఏడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని స్క్రీనింగ్‌కు హాజరయ్యే అవకాశం కల్పించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. దీంతో అప్పట్లో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్‌ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను కూడా 173కు పెంచింది. 2022–23 సంవత్సరంలో 96,439 మందికి సదరం సర్టిఫికెట్‌లను ఇచ్చింది.

>
మరిన్ని వార్తలు