ఎస్వీబీసీ చైర్మన్‌గా సాయికృష్ణ యచేంద్ర

28 Oct, 2020 20:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా నెల్లూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ యచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు