ఆఘోర వేషధారణలో హల్‌చల్‌.. నగ్నంగా చిందులేస్తూ..

24 Feb, 2022 13:24 IST|Sakshi

నర్సీపట్నం(విశాఖ జిల్లా): ఆఘోరాల వేషధారణలో మరోసారి సన్యాసులు(సాధువులు) హాల్‌చల్‌ చేశారు. గంజాయి మత్తులో ఇటీవల కాలంలో సన్యాసులు పట్టణంలో వీరంగం సృష్టిస్తున్నారు.  బుధవారం ఏకంగా టౌన్‌ స్టేషన్‌ ముందు హాల్‌చల్‌ చేశారు.

చదవండి: సుబ్బలక్ష్మికి ఫోన్‌కాల్స్‌.. భర్త విగ్గురాజు ఏం చేశాడంటే..?

చూసుకుందాం రండిరా అంటూ  నగ్నంగా చిందులు వేశారు.  పోలీసులు ఏమీ అనకపోవడంతో కొంత సేపు హాల్‌చల్‌ చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ విధంగా చేయడం ఇది మూడోసారి. 20 రోజుల క్రితం నగ్నంగా రోడ్డుపై నిలబడి వాహనాలను ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. రెండోసారి అదే విధంగా చేస్తే ప్రజలు దేహశుద్ధి చేశారు. ఇపుడు మరలా పోలీసు స్టేషన్‌ ముందు వీరంగం చేశారు.  

మరిన్ని వార్తలు