ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు

5 Nov, 2020 19:04 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు రేపటితో మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 'ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు' పేరిట 10రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.(చదవండి : ఏపీ: 100 ఏళ్ల తర్వాత మళ్లీ భూ సర్వే)

'పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలను వైఎస్‌ జగన్‌ దగ్గర్నుంచి చూశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చారు. సీఎం జగన్‌ విశ్వసనీయతకు కట్టుబడి పాలన సాగిస్తున్నారు.గత ప్రభుత్వం ఊహకందని అప్పులు మిగిల్చి వెళ్లింది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ తలకిందులు అయ్యింది.కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రజల్ని ఆదుకున్నాం. సీఎం జగన్‌ సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశారు కాబట్టే నిర్ణీత సమయానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.

పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమాల్లోనియోజకవర్గ ఎమ్మెల్యేలు ,ఇన్ చార్జ్ లు ,స్థానిక నేతలు పాల్గొంటారు' అని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన సీడీ, కరపత్రాలను సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.(చదవండి : మానవత్వం చాటుకున్న మహిళా మంత్రులు)

మరిన్ని వార్తలు