‘జమ్మలమడుగు’లో వారిద్దరు కలిసి పని చేస్తారు: సజ్జల

9 Apr, 2021 17:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏడాది క్రితమే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మా పార్టీలోకి వచ్చారు.. కోవిడ్‌ తీవ్రమవడంతో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం ఆలస్యమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు సీఎం జగన్‌ను రామసుబ్బారెడ్డి కలిశారు, పార్టీలో రామసుబ్బారెడ్డికి సముచిత గౌరవం ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సుధీర్‌రెడ్డి కష్టకాలంలో నిలబడి పోరాడారు.. ఎమ్మెల్యేగా గెలిచారు.. వచ్చే ఎన్నికల్లో కూడా సుధీర్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని ప్రకటించారు.

2023లో వచ్చే శాసనమండలికి రామసుబ్బారెడ్డి అనుభవాన్ని వాడుకుంటాం.. నియోజకవర్గ విభజన జరిగితే ఇద్దరికీ చెరో స్థానం ఇస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా రాజకీయాల్లో రామసుబ్బారెడ్డి కీలకంగా ఉంటారని చెప్పారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి రామసుబ్బారెడ్డి పనిచేస్తారు అని ప్రకటించారు. సీఎం జగన్‌ నాయకత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని రామసుబ్బారెడ్డి తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా తగిన గుర్తింపు ఇస్తామని సీఎం చెప్పారని పేర్కొన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ఇబ్బంది లేకుండా మేం పనిచేస్తాం, వచ్చే ఎన్నికల్లో సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని చెప్పారు. సుధీర్‌రెడ్డి కోసం నేను, మా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారని స్పష్టం చేశారు.

చదవండి: డ్రగ్స్‌ ఎమ్మెల్యేలు, వసూల్‌ మంత్రిని తొలగించండి
చదవండి: వాళ్ల కాళ్లు పట్టుకుని చంద్రబాబు సీఎం అయ్యారు
 

మరిన్ని వార్తలు