బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు: సజ్జల

25 Jul, 2021 16:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన భట్ట రాజులు కులస్తుల రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్తగా నామినేటెడ్ పదవులకు ఎన్నికైన వారు సంక్షేమ పథకాలను కింద స్థాయి వరకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ బీసీలకు నిజమైన సాధికారత కల్పించారన్నారు. ప్రజాసంక్షేమం కోసం సీఎం జగన్ నిరంతరం శ్రమిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మధ్య విమోచన కమిటీ చైర్మన్ లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు