-

నేటి నుంచి ఉత్సవాలు

8 Oct, 2020 04:54 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల పిలుపు

జగనన్న విద్యాకానుకపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: ఏపీలో విద్యా వికాసానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు ‘జగనన్న విద్యా కానుక’ ఉత్సవాలను ఒక పండుగలాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు ఒక సర్క్యులర్‌ను జారీ చేశారు. అదే అంశంపై సజ్జల వీరందరితోనూ బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, స్థానిక ముఖ్య నేతలంతా భాగస్వాములయ్యేలా చొరవ చూపాలి.
► జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్‌చార్జ్‌ మంత్రులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి.
► ఇలాంటి బృహత్తర పథకాలను చేపడుతున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపేలా ఉత్సవాలు నిర్వహించాలి. ఆసక్తి గల పార్టీ నేతలు వారం రోజుల వరకూ ఈ ఉత్సవాలు నిర్వహించవచ్చు.
► కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ కార్యక్రమాలు చేపట్టాలి. 

మరిన్ని వార్తలు