ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు..

25 Jan, 2021 19:42 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తుందని  ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని.. ప్రజారోగ్యం దృష్ట్యా తాము కోర్టుకు వెళ్లామని తెలిపారు. చదవండి: సమగ్ర వివరాలతో సిద్ధం కావాలి: సీఎం జగన్‌

‘‘ఉద్యోగ సంఘాల ఆవేదనను ఎస్‌ఈసీ అర్థం చేసుకోలేదు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాలన్న విషయాన్ని గమనించలేదు. ఈ సమస్య రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది. మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి.. పంచాయతీ ఎన్నికలు తీసుకురావడంలోనే కుట్ర కోణం ఉంది. తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎస్‌ఈసీ కేంద్రానికి లేఖ రాయడం సరికాదు. ప్రభుత్వంతో చర్చించాలన్న ఆలోచన ఇప్పటికీ ఎస్‌ఈసీకి లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం.. గెలవడం మా పార్టీకి కొత్త కాదు. చంద్రబాబులా ఎన్నికలకు భయపడి వెనకడుగు వేయం. ఎస్‌ఈసీ కేంద్రానికి లేఖ రాయడం అర్ధం లేని చర్య. ఉద్యోగ సంఘాలు తమ అభ్యంతరాలను చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైనా ఇదే ఇబ్బంది ఉంటుంది. సిబ్బందికి ఏదైనా జరిగితే ఎస్‌ఈసీదే పూర్తి బాధ్యత.వ్యాక్సినేషన్‌పై ఎలా ముందుకెళ్లాలనేది కేంద్రంతో చర్చిస్తామని’’ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: ఎన్నికలు వాయిదా వేసిన గోవా ఎస్‌ఈసీ

మరిన్ని వార్తలు