బీసీలు బలమైన నాయకులుగా ఎదగాలి: సజ్జల

29 Jun, 2021 09:45 IST|Sakshi

బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్లతో సజ్జల వర్చువల్‌ మీటింగ్‌

తాడేపల్లి: బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్లతో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వర్చువల్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలను సమాజానికి వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం జగన్‌ సంకల్పం అని అన్నారు. నూతన బీసీ నాయకత్వం కోసమే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని  సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు కులాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ బలమైన నాయకులుగా ఎదగాలని ఆయన కోరారు.

ఇక మంత్రి వేణు మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. ఈనెల 30న బీసీ కార్పొరేషన్ కార్యాలయాలను ప్రారంభిస్తామని మంత్రి వేణు అన్నారు. మంత్రి కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్‌ బీసీలకు గౌరవం కల్పించారు. బీసీకి చెందిన నన్ను డిప్యూటీ సీఎం చేయడమే నిదర్శనం’’ అని అన్నారు.

చదవండి:
చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్‌ జగన్‌తోనే..
విషం కక్కడమే ఎల్లోమీడియా ఎజెండా: సజ్జల

 

మరిన్ని వార్తలు