గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలి

29 Sep, 2022 06:03 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపునకు పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా సీతంరాజుసుధాకర్,  ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నియోజకవర్గం అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా వెన్నపూస రవి పోటీ చేస్తున్నారని తెలిపారు.  

మరిన్ని వార్తలు