ప్రమాద కారకులపై కఠిన చర్యలు..

9 Aug, 2020 12:18 IST|Sakshi

సాక్షి, కృష్ణా: కరోనా పేషెంట్ల కోసం  ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన ‌అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. ‘ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో అగ్ని ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటన కారకులపై కఠిన చర్యలు ఉంటాయి’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు