కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నాం: సజ్జల

16 Jul, 2021 11:43 IST|Sakshi
సజ్జల రామకృష్ణారెడ్డి ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, అమరావతి: కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, న్యాయం తమ పక్కనే ఉందని.. విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పూర్తయ్యేది కాదన్నారు.

విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను అడ్డగోలుగా వదిలేశారని.. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలకు గండి కొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ దూకుడుగా ఉన్నా సంయమనం పాటించామన్నారు. సీఎం జగన్ రాజ్యాంగబద్ధంగా ఒత్తిడితెచ్చి విజయం సాధించారని అన్నారు. 

ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ గెజిట్‌ నోటిఫికేషన్‌లో కొన్ని మార్చాల్సిన విషయాలున్నాయి. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై టీడీపీ అపోహలు సృష్టిస్తోంది. రాయలసీమకు సంబంధించి చంద్రబాబు వైఖరేంటి?. నామినేటెడ్‌ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉంది. మహిళలకు 50శాతం ఇస్తున్నాం.. కసరత్తులో కొంత ఆలస్యం అయ్యింది. రేపు ఉదయం ప్రకటిస్తాం. విశాఖ స్టీల్స్‌ విషయంలో నిజాయితీతో పోరాటం చేస్తున్నాం’’ అని అన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవు..
గెజిట్‌తో చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులెవరూ ఇబ్బంది పడకూడదని.. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడమే తమ కర్తవ్యమని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు