కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపు: సజ్జల

12 Jul, 2021 15:32 IST|Sakshi

గుంటూరు: కష్టపడిన ప్రతి ఒక్కరికి వైఎస్సార్‌సీపీలో గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పదవులు కొంతమందికి ముందు వస్తాయి మరికొందరికి తర్వాత వస్తాయని , అంతేగానీ పదవులు రాలేదని ఎవరూ కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో అందరికీ సమానంగా గౌరవం ఉంటుందన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా నిబద్ధతతో నిజాయితీతో పని చేస్తున్నారన్నారు.  ప్రజలతో ఉన్న అనుబంధమే వ్యక్తిని నాయకుడిని చేస్తుందని, సమాజం కోసం పని చేసే వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు అవే వస్తాయని తెలిపారు.  అలాగే పదవులు కూడా వాటంతట అవే వస్తాయని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రుజువు చేశారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కుటుంబం వంటిదని  సజ్జల పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు