Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

1 Oct, 2022 10:37 IST|Sakshi

1. వైఎస్సార్‌ కళ్యాణమస్తు పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వ దీవెన
రాష్ట్రంలో పేదోళ్ల ఆడ బిడ్డల కళ్యాణానికి ప్రభుత్వం నగదు దీవెనలు అందించనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాలకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది.

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ
రాష్ట్రంలో గ్రూప్‌–1 కేడర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్‌లో గ్రూప్‌–1 పోస్టులతో పాటు అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది.

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. గిరిజనులకు 10% కోటా.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం  
గిరిజనులకు శుభవార్త. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ ఉత్తర్వులు (జీవో నం.33) జారీ చేశారు.

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. కేటీఆర్‌ ట్వీట్‌కు రేవంత్ కౌంటర్‌.. చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయి
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పదేళ్ల కిందట జరిగిన సాగరహారం ఇప్పుడు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతల మధ్య ‘పిట్టపోరు’కు వేదికైంది. సాగరహారం ఫొటోలను ట్యాగ్‌ చేస్తూ తన ట్విట్టర్‌లో కామెంట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దీటుగా సమాధానమిచ్చారు.

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా దాడులు
ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాల విలీనం ఒప్పందంపై సంతకాలు చేయడానికి కొన్ని గంటల ముందే రష్యా క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై విరుచుకుపడింది. జపోరిజియా నగరంలోని మానవతా కాన్వాయ్‌పై జరిపిన దాడిలో 30 మంది మరణించారు.

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. కాంగి‘రేసు’.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలపైనే అందరి దృష్టి
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గాంధీ కుటుంబానికి చెందిన సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి విముఖంగా ఉండడంతో పోటీ అనివార్యమైంది. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది నాలుగోసారి.

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. మాటల మాంత్రికుడు శశి థరూర్‌ మామూలోడు కాదు.. అప్పుడు మోదీ కన్నా ఎక్కువ ఫాలోయింగ్‌
కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో నిలిచిన మాటల మాంత్రికుడు శశి థరూర్‌ (66) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాను ఎవరో ఆడించినట్లు ఆడే తోలుబొమ్మను కాదని చెబుతున్నారు. విభిన్న రాజకీయవేత్తగా థరూర్‌కు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయన చుట్టూ వివాదాలకు లెక్కలేదు.

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. రెపో రేటు పెంచుతూ ఆర్బీఐ వీర బాదుడు.. నిపుణులు ఏమంటున్నారో తెలుసా!
రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును తాజాగా మరో 50 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్‌ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈ పెంపు నిర్ణయంపై నిపుణుల ఏమంటున్నారంటే..

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. Womens Asia Cup 2022: ఫేవరెట్‌గా భారత్‌
మహిళల ఆసియా కప్‌ టోర్నీని 2004 నుంచి 2018 వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు భారతే విజేత. ఈ టోర్నీలో మన ఆధిక్యం ఎలా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. వన్డే ఫార్మాట్‌లో నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన మన అమ్మాయిలు టి20 ఫార్మాట్‌లో రెండు సార్లు టైటిల్‌ నెగ్గారు.

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. Ponniyin Selvan: మణిరత్నం కల నెరవేరిందా? 
దర్శకుడు మణిరత్నం మూడు దశాబ్దాల కల పొన్నియిన్‌ సెల్వన్‌. దీనిని సాధ్యం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో రెండుసార్లు విఫలమయ్యారు. పరిస్థితులు అనుకూలించకపోవడమే ప్రధాన కారణం అయినప్పటికీ మణిరత్నం నిరుత్సాహ పడలేదు. తన ప్రయత్నాన్ని వదులుకోలేదు.

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు