Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

28 Sep, 2022 09:55 IST|Sakshi

1. తిరుమల: నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌
తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సూపర్‌స్టార్‌  కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. లిక్కర్‌పై టక్కరి ఎత్తులు!
మద్యం తయారీ ధరల పెంపు కోసం డిస్టలరీలు ఎత్తులు వేస్తున్నాయి. పండుగ సీజన్‌ను ఆసరాగా చేసుకుని చీప్‌ లిక్కర్‌ కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే దెబ్బకు దెబ్బ అన్నట్టు ఎక్సైజ్‌ శాఖ ఏకంగా మద్యం దిగుమతులకు సిద్ధమవుతోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. కేంద్రం కీలక నిర్ణయం.. పీఎఫ్ఐపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ)పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఈ సంస్థతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న 8 సంస్థలను చట్టవ్యతిరేక సంస్థలుగా గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం!
అంతరిక్ష సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దిశగా కీలక ముందడుగు పడింది. భూమిని ఢీకొట్టే ఆస్కారమున్న గ్రహశకలాలను దారి మళ్లించి మానవాళికి ముప్పును తప్పించగలమన్న భరోసా ఏర్పడింది. భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో నాసా చేపట్టిన డబుల్‌ ఆస్టిరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌ (డార్ట్‌) విజయవంతమైంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. బన్రూటితో బంతాట.. పదవి నుంచి తప్పించిన పళణి స్వామి!
తమిళ రాజకీయాల్లో సీనియర్‌ నాయకుడైన బన్రూటి రామచంద్రన్‌తో అన్నాడీఎంకే  ముఖ్య నేతలు మంగళవారం బంతాట ఆడుకున్నారు. ఓ వర్గం నేతగా ఉన్న  పళణిస్వామి  బన్రూటిని పదవీ నుంచి తప్పిస్తే.. మరో వర్గం నేత పన్నీరు సెల్వం ఆయనకు కొత్త పదవిని కట్టబెట్టారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. వీడియోలు, ఓటీటీ కంటెంట్‌.. 70 శాతం మంది ఆ వయసు వారే!
మొబైల్‌ ఫోన్‌ దైనందిన జీవితంలో భాగమైంది. ఖాళీ సమయాల్లో 63.36 శాతం మంది యువత మొబైల్‌ ఫోన్లతో గడుపుతున్నారని ఇన్ఫోటైన్‌మెంట్‌ యాప్‌ వే2న్యూస్‌ సర్వేలో తేలింది. ఇందులో 51 శాతం మంది వీడియోలు, 29 శాతం ఓటీటీ కంటెంట్‌ చూస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. India Vs South Africa 1st T20: సఫారీతో ‘సై’
ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్‌ కోసం గట్టి ప్రత్యర్థులతో ఏర్పాటు చేసిన సిరీస్‌లలో ఒకటి ఆస్ట్రేలియాపై భారత్‌ గెలిచింది. ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలోనే సఫారీతో రెండో వేటకు సిద్ధమైంది. మేటి జట్టయిన దక్షిణాఫ్రికాతో మూడు టి20ల సిరీస్‌లో రోహిత్‌ బృందం తలపడనుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. పెళ్లికి సిద్ధమవుతున్న అనుష్క? 
అభిమానులు స్వీటీ అని పిలుచుకునే నటి అనుష్క. అందం, అభినయంలో విశేష గుర్తింపు ఆమె సొంతం. మంగళూరుకి చెందిన యోగా టీచర్‌ అయిన ఈమె 2005లో సూపర్‌ చిత్రంతో నాగార్జునకు జంటగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ‘నా పరిస్థితి ఎవరికీ రావొద్దు’.. యువతి సెల్ఫీ వీడియో కలకలం
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్తతోపాటు అతడి బంధువుల వేధింపులు తాళలేక క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గీసుకొండ మండలం కోటగండి వద్ద మంగళవారం చోటుచేసుకుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు