వైద్యం అందిస్తే చాలనుకున్నా.. 

24 Jul, 2020 07:32 IST|Sakshi
మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు స్వీట్‌ తినిపిస్తున్న తల్లి దాలమ్మ, పక్కనే భార్య శ్రీదేవి

నాకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు

ముఖ్యమంత్రికి, ప్రజలకు రుణపడి ఉంటా

‘సాక్షి’తో మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు  

కాశీబుగ్గ : ‘వెనుకబడిన జిల్లాలో వైద్య సేవలు అందిస్తే చాలని అనుకున్నాను.. అలాంటిది పలాస ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇప్పు డు మంత్రిగా సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. వీరికి రుణ పడి ఉంటాను’ అని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన గురువారం ‘సాక్షి’తో తన మనోభావాలు పంచుకున్నారు.  

సాక్షి : ఎమ్మెల్యే నుంచి మంత్రిగా మారారు. ఎలా ఫీలవుతున్నారు? 
మంత్రి : చాలా ఆనందంగా ఉంది. నేను ఈ ప్రాంతానికి వైద్యం అందిస్తే చాలనుకున్నాను. కానీ నా ప్రయాణం ఇంకా గొప్పగా సాగుతోంది. ఇంతటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 

సాక్షి : మీకు మంత్రి పదవి ఎలా వరించింది? 
మంత్రి : రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగాయి. నేను మత్స్యకార సా మాజిక వర్గానికి చెందిన వాడిని కావడం, సీఎం వైఎస్‌ జగన్‌కు శ్రీకాకుళంపై ప్రత్యేకమైన అభిమానం ఉండడంతో నాకు అవకా శం లభించిందని భావిస్తున్నాను.  

సాక్షి : మత్స్య, పశు సంవర్ధక శాఖల  బాధ్యతలు ఎలా నిర్వర్తించనున్నారు? 
మంత్రి : దేశంలో అత్యంత పొడవైన సము ద్ర తీరం కలిగిన మన రాష్ట్రంలో మత్స్య కారులకు కాసింత సదుపాయాలు కల్పిస్తే వారి జీవన విధానాలు మెరుగుపడతాయి. రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. నేను మత్స్యకార కుటుంబం నుంచి వచ్చినందున దానిపై ప్రత్యేకమైన యాక్షన్‌ ప్లాన్‌ ఉంది. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభు త్వం రైతులకు టాప్‌ ప్రయారిటీ ఇస్తోంది. అందుచేత పశుసంవర్ధక, పాడి పరిశ్రమల వృద్ధి మరింత పెంచుతాం. 

సాక్షి : జిల్లాపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? 
మంత్రి : రాష్ట్రంలో అనేక పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కానీ శ్రీకాకుళం జిల్లాకు ఇంతలా ప్రాధాన్యత ఇచ్చి న పార్టీ వైఎస్సార్‌ సీపీ ఒక్కటే. స్పీకర్, డిప్యూ టీ సీఎం, మినిస్టర్‌ పోస్టులను ఈ జిల్లాకు కేటాయించిన సీ ఎంకు రుణపడి ఉంటాం. దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా నష్టపోయిన వారి జాబితాలో శ్రీకాకుళం వాసుల పేర్లు ఉంటాయి. ఈ కష్టాలన్నీ సీఎంకు తెలుసు. జిల్లా ముఖ్య నాయకుల సహకారంతో జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తాం.   

సాక్షి : మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం? 
మంత్రి : చిన్నప్పటి నుంచి ఇక్కడ కిడ్నీ మరణాలను చూస్తూనే ఉన్నాను. వైద్యు డిగా ఎంతో మందికి సాయం చేసినా మరణాలు ఆగలేదు. ప్రభుత్వం తరఫు నుంచి పనిచేస్తే మరణాలను ఆపవచ్చని అనుకున్నాను. అలా నా రాజకీయ ప్రవేశానికి బీజం పడింది.   

సాక్షి : కిడ్నీ రోగులకు సేవలపై ప్రణాళిక ఉందా?  
మంత్రి : వాస్తవంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేయక ముందు ఆయ నను కలిశాను. ఆయనకు నా రాజకీయ జీవితం గురించి కాకుండా కిడ్నీ రోగుల సమస్యలను వివరించాను. అప్పుడే ఆయ న సాయం చేద్దామని మాటిచ్చారు. మొద టి బడ్జెట్‌లోనే రూ.50కోట్లు మంజూరు చేసి కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 200 పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నారు. ఆఖరు రెండు డ యాలసిస్‌ దశల్లో ఉన్న వారికి రూ.పదివేలు పింఛన్, తక్కువ స్థాయిలో ఉన్న కిడ్నీ రోగులకు రూ.5వేలు పింఛన్, ఇక మందసలో కొత్త డయాలసిస్‌ ఏర్పాటు, పలాసలో అదనపు మంచాల ఏర్పాటు వంటివి ఏర్పాటు చేసి వారం వారం పలా స వేదికగా కిడ్నీరోగులకు నెఫ్రాలజిస్టుతో వైద్యం అందించి మరణాలు రేటును తగ్గించారు. 

సాక్షి : ఉద్దాన ప్రాంతీయులకు ఎలా ఉపయోగపడతారు..?  
మంత్రి : ఉద్దానంలో ఉన్న ఏడు మండలాల్లో అధికంగా కిడ్నీ రోగులు ఉన్నారు. వారికి ప్రభుత్వం రూ.700 కోట్లతో ఇంటింటికీ తాగునీరు సౌకర్యం కల్పించే కార్యక్రమం చేపడుతోంది. దీనికి ఇప్పటికే ముఖ్యమంత్రి శంకుస్థాపన సైతం చేశారు. వజ్రపుకొత్తూరు మండలంలో జెట్టీ పనులకు భూమి పూజ చేపట్టాం. దీని వల్ల ఉద్దాన ప్రాంత మత్స్యకారులకు మేలు జరుగుతుంది. 

సాక్షి : మంత్రి పదవి దక్కడంపై కుటుంబ సభ్యులు ఎలా ఫీలవుతున్నారు..? 
మంత్రి : నా తల్లిదండ్రులు చేపల వేట చేసుకుని వచ్చి ఊరూరా చేపలు అమ్మి నన్ను చదివించారు. వారిని చూసే నేను పేదలకు సేవ చేయాలని డాక్టర్‌ అయ్యా ను. ఇప్పుడు నాకు రాష్ట్రమంతా సేవ చేసే అదృష్టం కలిగింది. నేను మంత్రిని అయ్యా నని తెలియగానే మా అమ్మ కళ్లల్లో తెలీని ఫీలింగ్‌ చూశాను. ఇటీవలే మా నాన్న చనిపోయారు. ఆయన ఉండి ఉంటే సంతోషపడేవారు. నా భార్యపిల్లలు, నా సోదరులు వారి పిల్లలు అందరూ ఆనందం వ్యక్తం చేశారు. పలాస నియోజకవర్గ ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.  

మరిన్ని వార్తలు