సాక్షి ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్‌’ మహోత్సవాలు

12 Aug, 2022 12:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: సాక్షి మీడియా గ్రూప్‌ విజయవాడలో శుక్రవారం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు’ ఘనంగా నిర్వహించింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ ఉత్సవాల్లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కలెక్టర్‌ ఢిల్లీరావు, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రానా టాటా పాల్గొన్నారు.
చదవండి: సీఎం జగన్‌కు రాఖీ విషెష్‌ చెప్పాలనుకుంటున్నారా.. అయితే..

గవర్నర్‌ మాట్లాడుతూ, దేశమంతా పండుగ జరుపుకోవాల్సిన సందర్భంగా పేర్కొన్నారు. ఎందరో మహనీయుల పోరాటంతో స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యిందని.. ఈ నేపథ్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరుపుకుంటున్నామని విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు.

ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబసభ్యులను సన్మానించారు. దేశ స్వాతంత్య్రోద్యమ అంశంపై నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌’ పేరుతో సాక్షి మీడియా గ్రూప్‌ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే తిరుపతిలోను, తెలంగాణలోని వరంగల్‌లోను ఈ ఉత్సవాలను నిర్వహించింది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు