నీట్, ఎంసెట్‌ విద్యార్థులకు సాక్షి మాక్‌టెస్టులు

24 Apr, 2022 09:37 IST|Sakshi

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. 2 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష

టాప్‌ టెన్‌ ర్యాంకర్లకు ఆకర్షణీయ బహుమతులు 

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్‌. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌/మెడికల్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌/అగ్రికల్చర్‌ తదితర కోర్సుల్లో అడ్మిషన్‌ కల్పించే ఎంసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు.

చదవండి👉: Competitive Exams: ఏ పోటీ పరీక్షలకైనా.. రాజకీయ అవగాహన తప్పనిసరి.. ఈ వ్యూహాలను అనుస‌రిస్తే..!

ఈ నేపథ్యంలో విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఎంసెట్, నీట్‌ పరీక్షలకు సాక్షి మాక్‌టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్‌ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్‌ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్‌ టెన్‌ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు.

సాక్షి మాక్‌ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌ అండ్‌ అగ్రికల్చర్‌) పరీక్ష 25 జూన్, 2022, 26 జూన్, 2022 (శనివారం, ఆదివారం) తేదీల్లో ఆన్‌లైన్‌లో జరగనుంది.

సాక్షి మాక్‌ నీట్‌ పరీక్ష 3 జూలై, 2022 (ఆదివారం) ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది.

ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.250. అభ్యర్థులు https://www. arenaone.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల ఈమెయిల్‌కు హాల్‌టికెట్‌ నంబర్‌ వస్తుంది. వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 96666 97219, 99126 71555, 96662 83534 

మరిన్ని వార్తలు