Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

11 Aug, 2022 09:54 IST|Sakshi

1. సీఎం జగన్‌ రాఖీ శుభాకాంక్షలు
రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. విద్యార్థులకు రూ.11,715 కోట్ల లబ్ధి
రాష్ట్రంలో పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తూ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. గాలి రాతలైతేనే అచ్చేస్తాం! రామోజీ పచ్చ రాతలు.. నిజాలకు పాతరేస్తూ ‘ఈనాడు’ కథనం
ఓబుళాపురం ప్రాంతంలోని మూడు ఇనుప ఖనిజం గనులకు ఉన్న 50 సంవత్సరాల లీజు కాలపరిమితి గత ఏడాదితో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి కాలపరిమితి ముగిసిన గనులకు 1957 గనుల చట్టం ప్రకారం ఈ–ఆక్షన్‌ ద్వారా తిరిగి లీజులు కేటాయించాలి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! జెండాల పంపిణీలో ఫ్లాగ్‌ కోడ్‌ ఉల్లంఘనలు
మూడు వర్ణాల్లో ఒక్కో వర్ణానిది ఒక్కో సైజు.. రంగులు సరిగ్గా అద్దక మధ్యలో తెల్లటి చారలు.. తెలుపు వర్ణం మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం పక్కకు జరగడం.. జెండాలపై చేతి రాతలు.. వెరసి జాతీయ పతాక నియమావళి (ఫ్లాగ్‌ కోడ్‌) ఉల్లంఘనలు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. జెండా కొంటేనే రేషన్‌.. తీ​వ్ర విమర్శలు
దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయజెండాను రేషన్‌కార్డు పేద లబ్ధిదారులతో బలవంతంగా కొనుగోలుచేయిస్తున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘రూ.20 పెట్టి జెండా కొనాల్సిందే. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ?
సాధారణంగా ఎన్ని గొడవలున్నా శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు అన్నింటినీ పక్కన పెట్టి ఒక్కటిగా కలుసుకుంటాం. అందుకు భిన్నంగా ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడంలో సిద్ధహస్తులుగా మారుతున్నారు టీడీపీ నగర నేతలు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. టీఆర్‌ఎస్‌లో టికెట్‌ లొల్లి.. అసమ్మతి లేఖాస్త్రం.. చల్లార్చే యత్నం
మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు వేగవంతం చేస్తున్నాయి. అయితే అధికార పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. సవరించని అమ్మకాల ధరలు, ఆయిల్‌ కంపెనీలకు భారీ షాక్‌!
పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతున్నా.. వాటి విక్రయ ధరలను సవరించకుండా నిలిపివేయడం వల్ల ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ లాభాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభావం పడుతుందని ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్‌ అంటున్న క్రీడాలోకం
చెస్‌ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత మహిళల ‘ఎ’ జట్టులో ద్రోణవల్లి హారిక కూడా సభ్యురాలు. ప్రస్తుతం 9 నెలల గర్భవతి అయిన హారిక...ఒక దశలో టోర్నీలో ఆడటం సందేహంగా మారింది. అయితే ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టులో భాగం కావడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఒకేరోజు షూటింగ్‌లో గాయపడిన ఇద్దరు హీరోయిన్స్‌
సీనియర్‌ హీరోయిన్‌ టబు షూటింగ్‌లో తీవ్రంగా గాయపడింది.బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును బైక్స్‌తో ఛేజ్‌ చేసే సీన్‌ షూట్‌ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు