AP: తదుపరి సీఎస్‌గా సమీర్‌ శర్మ

12 Sep, 2021 02:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా డా.సమీర్‌ శర్మ నియమితులు కానున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తదుపరి సీఎస్‌గా డా.సమీర్‌ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఈయన రాష్ట్ర ప్రణాళిక, రిసోర్స్‌ మొబిలైజేషన్‌ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.  

మరిన్ని వార్తలు