దాన్యం సేకరణను వేగవంతం చేయండి 

19 Oct, 2021 05:07 IST|Sakshi

సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సీఎస్‌ సమీక్షించారు. సీఎస్‌ మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలను కేంద్రంగా చేసుకుని ధాన్యం సేకరణ వేగవంతంగా చేయాలని ఆదేశించారు.

అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించాలని సూచించారు. అలాగే  రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ మరింత సులువుగా సాఫీగా జరిగేలా చూడాలని సీఎస్‌ ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షపై సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ జగనన్న శాశ్వత భూ హక్కు– భూరక్ష పథకం జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.   

ఉన్నతాధికారులతో 21న సీఎస్‌ సమావేశం 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ ఈ నెల 21వ తేదీన అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర అంశాలకు చెందిన సమాచారాన్ని వీలైనంత త్వరగా సీఎస్‌ కార్యాలయానికి పంపించాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక సీఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.   

మరిన్ని వార్తలు