వ్యర్థాల నిర్వహణకు పటిష్ట చర్యలు

29 Apr, 2022 05:15 IST|Sakshi

విశాఖపట్నం, గుంటూరుల్లో ప్రారంభానికి సిద్ధంగా వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లు

రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు మాస్‌ క్లీనింగ్‌ కార్యక్రమంసీఎస్‌ సమీర్‌శర్మ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపర్చడంతోపాటు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టామని ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎస్‌ సమావేశ మందిరంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటైన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. అన్ని గ్రామాలు, పట్టణాల్లో రోజూ ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేసేందుకు విశాఖపట్నం, గుంటూరు క్లస్టర్లలో ఏర్పాటైన ప్లాంట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వివిధ గ్రామ పంచాయతీలను మ్యాపింగ్‌ చేసి ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించేం దుకు చర్యలు తీసుకోవాలని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ అధికారులను ఆదేశించారు.

గ్రామాలు, పట్టణా ల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో మాస్‌ క్లీనింగ్‌ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నామన్నారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి 100 కి.మీల పరిధిలో వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేసే ప్లాంటును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసు కోవాలని అధికారులకు సూచించారు. ఈ సమా వేశంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఎండీ పి.సంపత్‌కుమార్, రాష్ట్ర అటవీ పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్, వీడియో లింక్‌ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కాలుష్య నియంత్రణమండలి కార్యదర్శి విజయకుమార్, మున్సిపల్‌ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీలను త్వరగా అందుబాటులోకి తేవాలి 
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన జిల్లా పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీలకు మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం సచివాలయంలో సీఎస్‌ సమీర్‌శర్మ అధికారులతో సమీ క్షించారు. కలెక్టర్లతో మాట్లాడి ఆయా కలెక్టరేట్ల లో రెండేసి రూముల వంతున వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏ కార్యదర్శి అ హ్మద్‌బాబును ఆదేశించారు. త్వరితగతిన పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌కు సూచించారు.

జ్యుడిషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాపై సీఎస్‌ సమీక్ష
నేషనల్‌ జ్యుడిషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన వివిధ అంశాలపై సీఎస్‌ సచివాలయం నుంచి న్యాయాధికా రులతో సమీక్షించారు. వీడియో ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్‌ వెంకట రమణ, తదితరులు పలు అంశాలను సీఎస్‌ దృష్టికి తెచ్చారు. వాటిలో ప్రాధాన్యతతో కూడిన అంశాలను త్వరగా పరిష్కరించాలని కోరారు. అనంతరం సీఎస్‌ మాట్లాడుతూ.. అథారిటీకి సంబంధించిన వివిధ అంశాల ప్రగతిని ప్రతి సోమవారం న్యాయశాఖ కార్యదర్శి తనకు వివరించాలని కోరారు. 

మరిన్ని వార్తలు