భక్తుల మనోభావాలను దెబ్బతీసిన పవన్ కల్యాణ్‌

6 Apr, 2021 04:20 IST|Sakshi

ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రధాన కార్యదర్శి సతీష్‌శర్మ

గుంటూరు రూరల్‌: ‘వైఎస్సార్‌సీపీకి ఓటు వేయడం వెంకన్నకు ద్రోహమే’ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తిరుపతి సభలో చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీశాయని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరి సతీష్‌శర్మ ధ్వజమెత్తారు. గుంటూరులోని సమాఖ్య కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ మాటలు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.

తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని బ్రాహ్మణులంతా ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేసి బీజేపీ, జనసేన పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనే బ్రాహ్మణులకు గౌరవం, రాజకీయంగా గుర్తింపు లభించాయన్నారు. బీజేపీ హిందుత్వ ముసుగులో బ్రాహ్మణులను మోసం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీలో తొలగించిన మిరాశీ అర్చకులకు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం తిరిగి విధుల్లోకి తీసుకుని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనుడు జగనన్న అని కొనియాడారు.  
(చదవండి: పవన్‌కల్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు )

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు