మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్‌ ఇదే..

7 Mar, 2023 16:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు.. మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీల ఖరారుపై చర్చించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10 నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ అమలు ప్రారంభం, మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు సీఎంవో నిర్ణయం తీసుకుంది. బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూలు ఖరారైంది. మార్చి 18 సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం.. జగనన్న విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ చేయనున్నారు. 

కార్యక్రమాల షెడ్యూల్‌:
మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన, వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు
మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం
మార్చి 25 నుంచి వైఎస్సార్‌ ఆసరా... ఏప్రిల్‌ 5 వరకూ కార్యక్రమం కొనసాగనుంది.
మార్చి 31న జగనన్న వసతి దీవెన
ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు
ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం
ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం
చదవండి: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు