చిన్ని ప్రాణం తల్లడిల్లిపోయింది

3 Mar, 2022 14:52 IST|Sakshi

సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం): చిన్ని ప్రాణం తల్లడిల్లిపోయింది. సూది గుచ్చుకుంటేనే తట్టుకోలేని వయసులో 11 కేవీ హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తలగడంతో ఆ గుండె ఆగిపోయింది. మండలంలోని మారుమూల పొల్లగిరి జన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఐదో తర గతి చదువుతున్న మండంగి ప్రవీణ్‌కుమార్‌ (11) బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. విద్యార్థి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆశ్రమ పాఠశాల నుంచి బయటకు వెళ్లా డు. అతడు నడుచుకుంటూ వెళ్తున్న దారిలో 11కేవీ హైటెన్షన్‌ వైరు తెగి పడి ఉంది. అది ఓ ఐరన్‌పోల్‌కు తాకి ఉండడం, విద్యార్థి ఆ స్తంభానికి సమీపంలోకి వెళ్లడంతో షాక్‌ తగిలిందని స్థానికులు చెబుతున్నారు.  

విద్యార్థిది పాలకొండ మండలం వంతవాడ కాలనీ గ్రామం. తండ్రి సూర్యారా వు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తల్లి సత్య వతి కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా రు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నవాడు ప్రవీణ్‌ పొల్లలో తాత ఇంటి వ ద్ద ఉంటూ ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్నా డు. కొడుకు చనిపోయాడనే వార్త విని ఆమె గుండెలవిసేలా రోదించారు. పొల్ల సర్పంచ్‌ ఆరిక గంగారావుతో పాటు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీఓ నవ్య, గిరిజన సంక్షేమాధికారులకు స్థానికులు సమాచారం అందించారు. ఏటీడబ్ల్యూఓ వెంకటరమణ పొల్ల ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థి దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించినట్టు గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎం.కమల తెలిపారు. దోనుబాయి ఎస్‌ఐ కిశోర్‌వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

మరిన్ని వార్తలు