Photo Feature: పుష్ప‘మే’

21 May, 2022 14:26 IST|Sakshi

మండే ఎండలు కాచే మే నెలలో ప్రకృతి కాస్త కరుణ చూపడంతో పాటు చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షాలు కురుస్తూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. ఇదే సమయంలో ఈ నెలలో మాత్రమే పూచే కొన్ని అరుదైన జాతుల మొక్కలు పుష్పించాయి. మండుతున్న బంతిలా ఉండే ఈ విచిత్ర పూలు ఎక్కువగా గల్ఫ్‌దేశాల్లో కనిపిస్తాయి. వీటి శాస్త్రీయ నామం స్కాడోక్సస్‌ మల్టీఫ్లోరస్‌. స్థానికంగా వీటిని బ్లడ్‌ లిల్లీ, ఫైర్‌బాల్‌ లిల్లీ అని పిలుస్తారు. యోగివేమన విశ్వవిద్యాలయం సూపరింటెండెంట్‌ జి.వి.నాగలక్ష్మి కృష్ణాపురంలోని తన నివాసంలో వీటిని పెంచుతున్నారు. 
– వైవీయూ (వైఎస్సార్‌ జిల్లా)


 

మరిన్ని వార్తలు