కొండలరాయుడికి తేళ్ల నైవేద్యం..

11 Aug, 2020 10:29 IST|Sakshi
స్వామివారికి సమర్పించేందుకు తేళ్లను తీసుకొస్తున్న మహిళా భక్తులు  

కోడుమూరు రూరల్‌:ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, ఫలహారాలను సమర్పించి కోరికలుకోరుకుంటారు. కోడుమూరులో కొండమీద వెలసిన శ్రీ కొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి తమ మొక్కులను తీర్చుకుంటారు. ఏటా శ్రావణమాసం మూడవ సోమవారం ఈ ఆచారాన్ని కోడుమూరు వాసులు దశాబ్దాలుగా కొనసాగిçస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు భయపడిపోతారు. 

ఈ కొండమీద మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి భయం లేకుండా చేతులతో పట్టుకొని శ్రీ కొండలరాయుడికి కానుకగా సమర్పించి తమ కోరికలను కోరుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిర్భయంగా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తేలును పట్టుకునే సమయంలో కుట్టినా స్వామి వారి ఆలయం చుట్టూ్ట మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. సోమవారం సాయంత్రం వందలాది మంది ప్రజలు కాలినడకన కొండపైకి చేరుకొని  కొండలరాయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది కొండపైకి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.  

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు