ఇనుములో ఓ హృదయం మొలిచెనే! 

25 Dec, 2020 11:27 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఇనుములోనూ ఓ హృదయాన్ని సృష్టించారు. అద్భుత కళానైపుణ్యంతో ఇనుప వ్యర్థాలకు జీవం పోశారు. అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ కళారూపాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. తెనాలికి చెందిన శిల్పకళాకారులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర వీటిని సృష్టించగా, వార్ఫ్‌రోడ్డులోని వర్క్‌షాపులో గురువారం ప్రదర్శించారు. ఆటోమొబైల్‌ పరికరాలతో భారీ శిల్పాలను తయారుచేస్తూ బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలతో పాటు సింగపూర్, మలేసియా వంటి దేశాలకు ఎగుమతి చేశారు. ప్రస్తుతం ప్రపంచ రికార్డు సాధన లక్ష్యంతో ప్రత్యేకించి ఈ తరహాలో భారీ కళాకృతులను రూపొందిస్తున్నారు. ఆరడుగుల ఎత్తులో డోలు, తబల, 15 అడుగుల పొడవైన సన్నాయి, ఎద్దుల బండి, క్రీస్తును శిలువ వేసిన బొమ్మను రూపొందించారు. 

 

మరిన్ని వార్తలు