కొత్త గేట్ ఏర్పాటుకి ప్రతిపాదనలు పంపుతాం

7 Aug, 2021 16:06 IST|Sakshi

సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేట్ వద్ద పనులు కొనసాగుతున్నాయని, సాయంత్రానికి స్డాప్ లాక్ గేట్ ఏర్పాటు పూర్తి చేస్తామని ఎస్‌ఈ రమేష్ బాబు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నాలుగు ఎలిమెంట్స్ ఒకదానిపై ఒకటి ఏర్పాటు చేశాం. ఇంకా ఏడు ఎలిమెంట్స్‌ని సాయంత్రానికి పెట్టి స్టాప్ లాగ్ గేట్‌ని పూర్తి చేస్తాం. ఇదే సమయంలో గత మూడు రోజులుగా ఎత్తిన 17 గేట్లని ఒక్కొక్కటిగా మూసివేస్తున్నాం. ఇప్పటివరకు ఏడు గేట్లు మూసేశాం.

ఆ తర్వాత మిగిలిన పది గేట్లని మూసివేసి అవుట్ ఫ్లో నిలిపివేస్తాం. ప్రస్తుతం సాగర్ నుంచి 27 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుంది. రోజుకి మూడు టీఎంసీలు వచ్చినా పది రోజులలో ప్రాజెక్ట్ వద్ద నీటి నిల్వ సామర్ద్యం యధావిధిగా 45 టీఎంసీలకు చేరుకుంటుంది. కొత్త గేట్ ఏర్పాటుకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతా’’మని అన్నారు.

మరిన్ని వార్తలు