మార్గదర్శి సహా చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌ కంపెనీల్లో సోదాలు

15 Nov, 2022 21:16 IST|Sakshi

అమరావతి: ఆంధప్రదేశ వ్యాప్తంగా చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌ కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. మార్గదర్శి సహా పలు చిట్‌ఫండ్‌ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌ అక్రమాలపై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు దాడులు చేశారు.  ఈ సోదాల్లో  తీవ్ర అక్రమాలు, ఉల్లంఘనలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో    ప్రజల కష్టార్జితాన్ని పరిరక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

కాగా అక్టోబరు 21న 12 చిట్‌ఫండ్‌ కంపెనీల్లో, అక్టోబరు 31న 5 చిట్‌ఫండ్‌ కంపెనీల్లో స్టాంప్స్‌ అండ్రి‌ జిస్ట్రేషన్స్‌ విభాగం అధికారులు సోదాలు నిర్వహించగా.. ఈ దాడుల్లో వెలుగుచూసిన అంశాల ఆధారంగా తప్పిదాలకు పాల్పడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ ఆదేశాలు జారీ చేశారు.  ఈమేరకు మంగళవారం రాష్ట్రంలో మొత్తం 18 చోట్ల అధికారులు తనిఖీలు జరిపారు. 

 2021-22 మధ్య చిట్స్‌ మొత్తాలను మళ్లించినట్టుగా, మందస్తు పద్ధతిలో డబ్బులు వసూలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు.  దీనికి 5శాతం వడ్డీని చెల్లించనట్టు కూడా గుర్తించామని అధికారులు తెలిపారు. చిట్‌ఫండ్‌ చట్టంలో సెక్షన్‌ 31ని ఉల్లంఘన, పాటపాడుకున్న వ్యక్తి నుంచి సరిగ్గా సెక్యూరిటీ తీసుకోకపోవడం, కంపెనీలుకూడా సెక్యూరిటీ ఇవ్వకపోవడాన్ని కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆలస్యంగా చిట్టీలు కట్టినవారిపై వేసిన పెనాల్టీలకు జీఎస్టీ చెల్లించకపోవడం కూడా తెలిసిందని తెలిపారు. 

మరిన్ని వార్తలు