మడ అడవుల్లో సారా బట్టీలపై మెరుపు దాడి

3 Sep, 2020 21:00 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ కోరింగ మడ అడవుల్లో నాటు సారా తయారీ స్థావరాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ), పోలీసులు కలిసి దాడులు చేపట్టారు. ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్ బ్రిజ్‌లాల్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ సుమిత్ నేతృత్వంలోని పోలీసుల బృందం అభయారణ్యంలో దాడులు జరిపింది. మడ అడవుల్లో 22 సారా బట్టీలపై మెరుపు దాడిన చేసిన ఎస్‌ఈబీ అధికారులు 46000 లీటర్ల ఊట బెల్లాన్ని ద్వంసం చేశారు. 200 లీటర్ల సామర్థ్యం కలిగిన 230 బారెల్స్‌ను గుర్తించిన ఎస్‌ఈబీ అధికారులు 1400 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్ఈబీ అదనపు ఎస్పీ సుమీత్ గరుడ్ స్వయంగా పాల్గొనగా..దాడులను ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే పోలీసుల రాకతో  సారా తయారీదారులు అక్కడి నుంచి పరారయ్యారు.

మరిన్ని వార్తలు