ఎస్‌ఈసీ మరో వివాదాస్పద నిర్ణయం

29 Jan, 2021 12:36 IST|Sakshi

జిఎడి పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌పై సీఎస్‌కు లేఖ

నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు

సాక్షి, విజయవాడ: మరోసారి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌  వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల‌ విధుల నుంచి జిఎడి పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ని తప్పించాలంటూ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఎస్ఈసీ లేఖ రాశారు. నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయంపై ఉద్యోగ వర్గాలలో ఆందోళన నెలకొంది. సంబంధం లేని అంశాలని ప్రవీణ్ ప్రకాష్‌కి ఆపాదిస్తూ.. ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేశించడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నిమ్మగడ్డ తీరు: నాడు అలా.. నేడు ఇలా..

ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఎస్‌ఈసీ కోరారు. కలెక్టర్లు,‌ ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో ఎస్‌ఈసీ పేర్కొన్నారు. తన సిఫార్స్ లేఖలు పంపిన పలువురు ఉద్యోగులను సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఎస్‌ఈసీ తెలిపారు. అధికారులపై చర్యలు అంశం పొలిటికల్ ముఖ్య కార్యదర్శికి సంబంధం లేని విషయమని అధికారులు అంటున్నారు. చదవండి: సెన్సూర్‌ అధికారం ఎస్‌ఈసీది కాదు

ఈ నెల 23న కలెక్టర్లు,‌ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ జరగకుండా చేశారని లేఖలో నిమ్మగడ్డ అబద్దపు ఆరోపణలు చేశారు. జీఏడీకి ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ తన ఆదేశాలను పట్టించుకోలేదని  లేఖలో ఎస్‌ఈసీ తెలపగా, సీఎస్‌కి రాసిన లేఖలతో  జీఏడీ ముఖ్య కార్యదర్శికి ఏ సంబంధముంటుదని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో ఆయన విఫలమయ్యారని లేఖలో ఎస్‌ఈసీ పేర్కొనడంపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని, ఈ నెల 25 న అభ్యర్ధుల నుంచి నామినేషన్ల స్వీకరణకు సహకరించలేదంటూ ప్రవీణ్ ప్రకాష్ పై తప్పుడు ఆరోపణలను అధికారులు ఖండిస్తున్నారు. 

మరిన్ని వార్తలు