ఏపీ వ్యాప్తంగా రెండో రోజు వ్యాక్సినేషన్..

17 Jan, 2021 10:24 IST|Sakshi

332 కేంద్రాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రెండో రోజు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం గంటల వరకు వ్యాక్సినేషన్‌ సాగనుంది. రాష్ట్రంలో తొలి రోజు కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ విజయవంతం కాగా, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం కొనసాగింది. దేశంలోనే అత్యధికంగా మొత్తం 332 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. శనివారం 19,108 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం 14,300 మాత్రమే. ఈ లక్ష్యానికి మించి టీకా కార్యక్రమం కొనసాగింది. చదవండి: తొలిరోజు 19,108 మందికి

దేశంలో కరోనా నియంత్రణ, నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎలా ముందంజ వేసిందో వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియలోనూ దేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21,291 మందికి వ్యాక్సిన్‌ వేశారు. జనాభా ప్రాతిపదికన వ్యాక్సిన్‌ వేసిన వారి సంఖ్య (19,108 మంది) చూస్తే ఏపీలో అత్యధికం. అత్యల్పంగా లక్షద్వీప్‌లో 21 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు.  ఆంధ్రప్రదేశ్‌ కంటే ఎక్కువ జనాభా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో 13,594 మందికి, మహారాష్ట్రలో 18,328 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఎక్కువ మందికి టీకా ఇచ్చిన జాబితాలో యూపీ ప్రథమస్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఏపీ, మూడో స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి. చదవండి: కరోనాపై గెలుపు తథ్యం

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు