నేడు రెండో డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక

30 Jul, 2021 05:33 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మార్చిలో ఎన్నికలు నిర్వహించిన 12 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల్లో నేడు (శుక్రవారం) రెండో డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికను నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల్లో రెండో వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కొన్ని నెలల కిందట నిర్ణయం తీసుకుంది.

పట్టణ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ పదవులను సృష్టిస్తూ మునిసిపల్‌ చట్టాన్ని సవరించింది. ఆ మేరకు రెండో డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహించేందుకు శుక్రవారం మునిసిపల్‌ పాలకమండళ్లను ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు