7న వైఎస్సార్‌ ఆసరా రెండో విడత సాయం

5 Oct, 2021 03:15 IST|Sakshi
పీవీఆర్‌ మైదానాన్ని పరిశీలిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, కలెక్టర్‌ ప్రవీణ్, ఎస్పీ మలికాగర్గ్‌ తదితరులు

ఒంగోలులో ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి బాలినేని, తలశిల రఘురాం  

ఒంగోలు: వైఎస్సార్‌ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 7న ఒంగోలులో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం సోమవారం పరిశీలించారు. సభాస్థలి కోసం ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలోని హెలీపాడ్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

7వ తేదీ ఉదయం 11 గంటలకు సభ జరుగుతుందని, లబ్ధిదారులతో సీఎం జగన్‌ ముఖాముఖి మాట్లాడుతారని చెప్పారు. అనంతరం పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా అధికారులతో కలిసి మంత్రి బాలినేని, తలశిల రఘురాం పరిశీలించారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, ఎస్పీ మలికాగర్గ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు