Andhra Pradesh: రెట్టింపు ఆనందం

2 Aug, 2022 19:45 IST|Sakshi

భారీగా పెరిగిన సచివాలయ ఉద్యోగుల వేతనాలు

జూలై నెల జీతం అందుకున్న ఉద్యోగులు

మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సచివాలయ వ్యవస్థ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ఇది ఒకటి. నిరుద్యోగులకు వాటిల్లో ఉద్యోగాలు లభించాయి. ఈ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందుతున్నాయి. సంక్షేమ పథకాలు ఇళ్ల ముంగిటకే చేరుతున్నాయి. కొత్త జీతం జమ కావడంతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు.  

నెల్లూరు(అర్బన్‌): సచివాలయ ఉద్యోగుల్లో ఆనందం వెల్లవిరిసింది. వారి జీతం రెట్టింపు కావడమే దీనికి కారణం. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి ప్రొబేషన్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల్లా తొలిసారి పే స్కేల్, డీఏ, హెచ్‌ఆర్‌ఏతో కూడిన జూలై నెలకు సంబంధించిన వేతనం సోమవారం ఉద్యోగుల బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేశారు. జిల్లాలో 7,091 మంది ఉద్యోగులున్నారు. కొత్త జీతం పడడంతో గ్రామ/వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అలాగే డీపీఓ ధనలక్ష్మిని కలిసి మాట్లాడారు. ఆమె వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ మంచిపేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు కలెక్టరేట్‌లో సాక్షితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. 

కల సాకారం చేసిన సీఎం 
నిరుద్యోగుల కలను సాకారం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. మా అందరికీ ఉద్యోగాలు కల్పి ంచారు. సమాజసేవలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. కొత్త జీతాలు పొందడం ద్వారా మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. 
– సందీప్, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, సౌత్‌మోపూరు 

సీఎం ఉద్యోగాల సృష్టికర్త  
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగాల సృష్టికర్త. ఉద్యోగాలు కల్పించడమే కాకుండా సకాలంలో ప్రొబేషన్‌ ఖారారు చేసి కొత్త జీతా లు విడుదల చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటాం. సచివాలయ ఉద్యోగుల గుండెల్లో ముఖ్యమంత్రి చిరస్థాయిగా ఉంటారు. 
– మనోహర్, వీఆర్వో, వరికుంటపాడు, అసోసియేషన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ 

రుణపడి ఉంటాం 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రొబేషన్‌ ఖారారు చేశారు. అంతే వేగంగా కొత్త జీతాన్ని అందించారు. దీంతో ఒక్కసారిగా తమ జీతం రెట్టింపు అయ్యింది. దీంతో మా కుటుంబాల్లో ఆనందం వెల్లి విరిసింది. సీఎంకు రుణపడి ఉంటాం. 
– మల్లంపూడి సతీష్‌రెడ్డి, గ్రామ/వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ 
అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు
 
 
గ్రామ స్వరాజ్యం సాకారం 
ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను నెలకొల్పి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే అందేలా చేసి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారు. ఉద్యోగాలు కల్పించడమే కాకుండా సకాలంలో ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసినందుకు కృతజ్ఞతలు. మా కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. 
– బాలారాజన్, సచివాలయ మున్సిపల్‌ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు