సికింద్రాబాద్‌–విజయవాడ మధ్య ప్రత్యేక రైలు 

17 Oct, 2021 04:49 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌–విజయవాడ మధ్య రెండు రోజుల పాటు ప్రత్యేక ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైలు (07567) ఈ నెల 17, 18 తేదీల్లో ఉదయం 8.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

తిరిగి ఈ రైలు (07568) మధ్యాహ్నం 3.55 గంటలకు విజయవాడలో బయలుదేరి, రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మౌలాలీ, చెర్లపల్లి, బీబీ నగర్, రామన్నపేట, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూర్‌ స్టేషన్‌లలో ఆగుతుంది.     

మరిన్ని వార్తలు