లారీ నన్ను ఢీకొట్టలేదు: విజయ్‌బాబు

25 Jul, 2020 18:10 IST|Sakshi

సాక్షి, సీతానగరం (రాజానగరం): తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో జరిగిన శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన బాధితుడు విజయ్‌బాబు ఇసుక లారీయే తనను ఢీకొట్టలేదని చెప్పాడు. ప్రసాద్, ఇంకొందరితో కలసి మద్యం తాగిన తాను తరువాత ఇంటికి వెళ్తూ బైక్ పై నుండి అదుపు తప్పి పడిపోయాయని స్పష్టం చేశాడు. అసలు తనకు ప్రమాదం జరిగిన సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి లేడని, వారి వ్యక్తిగత గొడవలు కప్పిపుచ్చుకునేందుకు తన ప్రమాదాన్ని వాడుకున్నారని ఆరోపించాడు. దళిత నాయకుడినని చెప్పుకునే హర్షకుమార్ కులం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నాడు.

విజయ్‌బాబు ఏమన్నాడంటే...
‘ఈ నెల 18న రాత్రి ఏడున్నర వరకు ప్రసాద్‌తో కలిసి మద్యం తాగిన మాట వాస్తవమే. తర్వాత నేను ఒక్కడినే అక్కడి నుంచి బైక్‌పై ఇంటికి బయలుదేరాను. నన్ను లారీ ఢీకొట్టలేదు. బైక్‌పై నుంచి పడిపోవడం వల్లే గాయపడ్డాను. ప్రసాద్‌.. ఇసుక లారీలను ఆపి మద్యానికి డబ్బులు అడగటం లాంటివి చేస్తుంటాడు. అతడిపై చాలా కేసులు ఉన్నాయి. నన్ను లారీ ఢీకొట్టిందని నాటకమాడి డబ్బులు గుంజడానికి ప్రయత్నించాడు. హర్షకుమార్‌ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం​ కరెక్ట్‌ కాదు. గాయపడిన నన్ను పరామర్శించడానికి ఏ నాయకుడు కూడా రాలేదు. నా బాధలు నేను పడుతున్నా. నన్ను ఏ లారీ ఢీ​ కొట్టలేదు, గొడవకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జరిగిన ప్రమాదంతో ప్రసాద్‌కు సంబంధం లేదు’ అని విజయ్‌బాబు అన్నాడు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగు రావడంతో పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. (శిరోముండనం కేసులో ఎస్‌ఐ అరెస్టు)

హర్షకుమార్ క్షమాపణలు చెప్పాలి: అమ్మాజీ
దళితుల తల్లులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్‌పై మండిపడ్డారు మాల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ. హర్షకుమార్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు సార్లు వైఎస్సార్ దయతో ఎంపీగా పనిచేసిన హర్షకుమార్ ఇంత దారుణంగా మాట్లాడడాన్ని ఖండించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివేవాడు దళిత నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. (‘హర్షకుమార్‌.. నాలుక అదుపులో పెట్టుకో’)

మరిన్ని వార్తలు