సీనియర్‌ పాత్రికేయులు ఎం.రాజేంద్ర కన్నుమూత 

26 May, 2021 12:49 IST|Sakshi

బంజారాహిల్స్‌: సీనియర్‌ జర్నలిస్ట్, కథా రచయిత ముత్తిరేవుల రాజేంద్ర (84) బంజారాహిల్స్‌ జర్నలిస్ట్‌ కాలనీ లోని తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య రాజేశ్వరితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. రాజేంద్ర ఇండియాటుడే తెలుగు ఎడిషన్‌కు మొదటి ఎడిటర్‌గా పనిచేయడంతో పాటు కథా రచయితగానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

ఆయన ఈనాడు చీఫ్‌ సబ్‌ఎడిటర్‌గా, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, జనతా పత్రికలలో కూడా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఇండియాటుడే వార్షిక సాహిత్య సంచిక తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత రాజేంద్రదే. చిత్తూరు జిల్లా అరగొండకు చెందిన రాజేంద్ర అపోలో ఆస్పత్రిచైర్మన్‌ ప్రతాప్‌రెడ్డికి బంధువు. ఆయన అంత్యక్రియలు మంగళవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించారు.
చదవండి: మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య ఇకలేరు..

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు