ఏపీలోని 17 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవకతవకలు: రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ

13 Aug, 2021 16:55 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

అమరావతి: ఏపీలోని17 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాల అవకతవకలు జరిగినట్లు గుర్తించామని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు తెలిపారు.10 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.5.25 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని శేషగిరిబాబు వెల్లడించారు. ఇప్పటికే రూ.కోటి రికవరీ చేశామని, అవకతవకలపై ఆరుగురు సబ్‌రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేశామని అన్నారు.

మిగతా సబ్‌రిజిస్ట్రార్లపై విచారణ జరుగుతోందన్నారు. అవకతవకలు జరిగిన చోట్ల కేసులు నమోదు చేయిస్తున్నామని ఐజీ శేషగిరిబాబు అన్నారు. 2021 ఏప్రిల్ నుంచి జులై వరకు 54 నకిలీ చలానాలు గుర్తించినట్లు తెలిపారు. నకిలీ చలానాలతో రూ.7లక్షల మేర గోల్‌మాల్ జరిగినట్టు నిర్ధారించారు. చలానాల గోల్‌మాల్‌లో డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పొన్నూరు, భీమవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీలు చేపట్టింది. కాగా తణుకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రూ.54,100 అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు