ఏడేళ్ల వసపిట్ట... శ్లోకాల పుట్ట

3 May, 2021 13:14 IST|Sakshi
తల్లి ఒడిలో కూర్చొని భగవద్గీత శ్లోకాలు పఠిస్తున్న చిన్నారి గౌరి 

మూడేళ్ల నుంచే ఆధ్యాత్మికంపై మక్కువ

అలవోకగా 700 శ్లోకాలు చెబుతున్న బాలిక

జామి: సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోయే పిల్లలున్న ఈ సమాజంలో ఓ ఏడేళ్ల చిన్నారి రామాయణ ,మహాభారతం గ్రంథాల్లో, భగవద్గీతలో పట్టుసాధించడమే కాకుండా, యోగ విద్యలో చక్కని ప్రతిభ కనబరుస్తోంది. వివరాల్లోకి వెళితే...జామి మండలం విజినిగిరి గ్రామానికి చెందిన కొవ్వాడ శ్రీను, అరుణ దంపతులకు చెందిన ఏడేళ్ల కుమార్తె గౌరి. ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఆ బాలిక తండ్రి భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు, తల్లి అరుణ ప్రైవేట్‌ పాఠశాలలో యోగా అధ్యాపకురాలిగా పని చేయడమే కాకుండా వారిద్దరూ ఉచితంగా యోగాపై శిక్షణ ఇస్తుంటారు.

వారిది మొదటి నుంచీ ఆధ్యాత్మిక చింతన ఉన్న కుటుంబం కావడంతో చిన్నారి అరుణకు కూడా భక్తిభావం వైపు దృష్టి మళ్లింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో యోగాసనాలు, రామాయణ, మహా భారత గ్రంథాలపై మక్కువతోపాటు, భగవద్గీత శ్లోకాలు 700 వరకూ అలవోకగా గుక్క తిప్పకుండా పఠిస్తోంది. మూడో సంవత్సరం నుంచే ఈ శ్లోకాలు పఠిస్తుందేండేదని, కరోనా సమయంలో గత ఏడాదిగా మరిన్ని శ్లోకాలు కంఠతా చేసి మరింత పట్టు సాధించడమే కాకుండా... పలు ఆసనాలను సునాయాశంగా వేస్తుందని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ చిచ్చర పిడుగు ప్రతిభను గుర్తించి పలు న్యూస్‌ చానల్స్‌ ప్రసారం చేశాయి.

 

చదవండి: భర్తను భయపెట్టాలని.. ప్రాణం పోగొట్టుకుంది
అవినీతి ఖాకీ ‘సెల్ఫీ బాణం’ 

మరిన్ని వార్తలు