ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..

29 Apr, 2023 17:59 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.  బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్‌గా అనంతరాము బాధ్యతలు నిర్వహించనున్నారు. సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జి.జయలక్ష్మి, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా రజత్ భార్గవ బదిలీ అయ్యారు. పర్యాటక, సంస్కృతికశాఖ అదనపు బాధ్యతలు కూడా రజత్ భార్గవకు అప్పగించారు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యతలను సీఎస్‌ పర్యవేక్షించనున్నారు.  మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇంతియాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
చదవండి: స్థూల జాతీయ వృద్ధి రేటులో దేశంలోనే ఏపీ అ‍గ్రగామి

మరిన్ని వార్తలు