తెగిపడిన చేయి.. అంతా క్షణాల్లోనే..

5 Apr, 2021 08:31 IST|Sakshi
సంఘటన స్థలంలోని విద్యుత్‌ వైరు, స్టీల్‌ పైపు- తెగిపడిన ఆయేషా చేయి 

తెగిపడిన చేయి..

కడప అర్బన్‌: కడపలోని అక్కాయపల్లిలో శనివారం రాత్రి  విద్యుత్‌షాక్‌తో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాలూకా సీఐ ఎం. నాగభూషణం కథనం  మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్కాయపల్లిలోని సొంత ఇంటిలోని రెండో అంతస్తులో  నివాసం ఉంటున్న షేక్‌ ఆరిపుల్లా, భార్య ఫరీదాలకు ముగ్గురు కుమార్తెలు. ఆరిపుల్లా ప్రస్తుతం కువైట్‌లో ఉన్నాడు. ప్రతీ రోజూ చెత్తను, ఇతర వస్తువులను, కూరగాయలను బకెట్‌లో పెట్టి పైకి, కిందికి తీసుకుని వస్తుంటారు. ఈక్రమంలో ఆ బకెట్‌కు పాత విద్యుత్‌ వైరును కట్టి ఉంచారు.

ఈనెల 3వ తేదీ రాత్రి మూడో కుమార్తె అయేషా(12) చెత్తబుట్టను కిందకు వేసింది. బకెట్‌ విద్యుత్‌ వైర్లకు తగలడంతో షాక్‌కు గురైంది. ఈక్రమంలోనే స్టీల్‌ పైపునకు చేయి తగలడం, తెగిపడటం క్షణాల్లో జరిగిపోయాయి. సంఘటన జరిగిన వెంటనే తల్లి ఫరీదా(37) కుమార్తెను పట్టుకోవడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ప్రజల సాయంతో విద్యుత్‌ సరఫరా ఆపించారు. గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించారు. మెరుగైన చికిత్సకోసం క్రిస్టియన్‌లేన్‌లోని హోలిస్టిక్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
చదవండి:
బందరులో బాలిక కిడ్నాప్‌ కలకలం 
అనిత వీడియో: అడ్డంగా బుక్కైన మంత్రి 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు